బెన్ స్టోక్స్ కు ఉద్వాసన

Stokes withdrawn from Ashes squad, Finn makes the cut

లండన్: ఊహించనట్లే ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నెల్లో బ్రిస్టల్ లోని హోటల్ లో ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో స్టోక్స్ ను ఇప్పటికే జట్టు నుంచి సస్పెండ్ చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ).. వచ్చే నెల్లో ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో పాల్గొనే ఇంగ్లిష్ జట్టు నుంచి సైతం అతన్ని తప్పించింది.యాషెస్ సిరీస్ లో భాగంగా  ఈ నెల చివరల్లో ఆస్ట్రేలియాకు పయనమయ్యే ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ కు చోటు కల్పించలేదు. ఈ విషయాన్ని  ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. బెన్ పై విచారణ పూర్తయ్యే వరకూ అతనిపై వేటు తప్పదని పేర్కొంది. అతని స్థానంలో పేసర్ స్టీవెన్ ఫిన్ కు జట్టులో స్థానం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

'యాషెస్ సిరీస్ కు సమయం దగ్గరపడుతుంది. ప్రతీ ఒక్క ఆటగాడికి యాషెస్ కు చాలా ముఖ్యం. యాషెస్ సిరీస్ కు స్టోక్స్ ను పక్కక పెట్టక తప్పలేదు. దీనిపై స్టోక్స్ తో మాట్లాడాం. పోలీస్ విచారణ పూర్తయ్యే వరకూ అతనిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. దానిలో భాగంగానే యాషెస్ కు స్టోక్స్ కు ఉద్వాసన పలికాం'అని ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ తెలిపారు. ఇదిలా ఉంచితే, 2017-18 సీజన్ కు గాను ఇంగ్లండ్ క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో స్టోక్స్ కు స్థానం దక్కడం విశేషం. నవంబర్ 23 వ తేదీ నుంచి ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభం కానుంది.ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరుగనుంది.

బెన్ స్టోక్స్ పిడిగుద్దులు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top