వన్డే జట్టులో స్టోక్స్‌

Stokes in One Day team - Sakshi

సిడ్నీ: ఓ వ్యక్తిపై దాడి కేసులో విచారణ ఎదుర్కొంటూ ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను వన్డేల్లో ఆడించాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. యాషెస్‌ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో స్టోక్స్‌కు చోటు లభించింది. దాడి ఘటనలో అతనితో పాటే ఉన్న హేల్స్‌ను కూడా ఈ టీమ్‌లోకి ఎంపిక చేశారు.

అయితే వీరిద్దరు కూడా తుది జట్టులో ఉండి మ్యాచ్‌లు ఆడతారా అనేదానిపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. బ్రిస్టల్‌లో జరిగిన నైట్‌ క్లబ్‌ ఉదంతం తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో రెండు వన్డేలు ఆడగా...వాటిలో ఆడించకుండా ఈ ఇద్దరినీ పక్కన పెట్టారు. ప్రస్తుతం స్టోక్స్‌ న్యూజిలాండ్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు.   

Back to Top