టెస్టుల్లో కోహ్లి కన్నా స్మిత్‌ మిన్న

Steve Smith is Better Than Virat Kohli, Says Shane Warne - Sakshi

షేన్‌వార్న్‌ వ్యాఖ్య

మెల్‌బోర్న్‌: టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కంటే ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మెరుగైన ఆటగాడని ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ కోహ్లి మూడు ఫార్మాట్‌లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ టెస్టుల విషయానికొస్తే.. స్టీవ్‌ స్మితే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని షేన్‌ వార్న్‌ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు. ‘నేను కేవలం గణాంకాల ఆధారంగా మాత్రమే ఈ మాటలు చెప్పడం లేదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పేస్‌ పిచ్‌లపై రాణించినప్పుడే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు లభిస్తుంది.

ఉపఖండంలో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్న విరాట్‌ కోహ్లి వచ్చే ఏడాది కఠినమైన పర్యటనల్లో ఏం చేస్తాడో చూద్దాం’ అని వార్న్‌ అన్నాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లతో పాటు తాను చూసిన అత్యుత్తమ టెస్టు ఆటగాళ్లలో 11 మంది జాబితాను వార్న్‌ శుక్రవారం విడుదల చేశాడు. అందులో విరాట్‌ కోహ్లికి 11వ స్థానం దక్కగా.. స్మిత్‌ పదో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో విండీస్‌ వీరులు వివ్‌ రిచర్డ్స్, లారాలు ఉండగా.. మూడో స్థానంలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆ తర్వాత వరుసగా గ్రెగ్‌ చాపెల్, రికీ పాంటింగ్, అలెన్‌ బోర్డర్, కలిస్, గ్రాహం గూచ్, ఏబీ డివిలియర్స్, స్టీవ్‌ స్మిత్, విరాట్‌ కోహ్లిలు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top