అవి రూమర్స్‌.. వాటిలో వాస్తవం లేదు: వార్నర్‌

Steve and me are good mates, says Warner - Sakshi

టొరంటో: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన కారణంగా వీరు నిషేధాన్ని చవిచూడాల్సి వచ‍్చింది. అయితే ఈ వివాదానికి డేవిడ్‌ వార‍్నరే ప్రధాన కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనికి స‍్టీవ్‌ స్మిత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలు సైతం వెలుగు చూశాయి. దీనిపై వార‍్నర్‌ స్పందిస్తూ... ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య ఏ విధమైన విభేదాలు చోటు చేసుకోలేదన్నాడు. ఒకవేళ తమ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని ఎవరైనా అనుకుంటే అది తెలియక మానదు కదా?అని ఎదురు ప్రశ్నించాడు.

వార్నర్‌ విఫలం..

ఒకవైపు గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఆకట్టుకుంటే,  వార్నర్‌ మాత్రం విఫలం చెందాడు.  విన్నీపెగ్‌ తరపున బరిలోకి దిగిన వార్నర్‌ పరుగు మాత్రమే చేశాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న వార్నర్‌..లసిత్‌ మలింగాలో బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top