ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌

Starc on fire as Australia thrash Sri Lanka to win series - Sakshi

కాన్‌బెర్రా: శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా 366 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసింది. ఆసీస్‌ నిర్దేశించిన 516 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక  149 పరుగులకే కుప్పకూలింది.

17/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక.. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు  చేతులెత్తేసింది. స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగి లంకేయులు పతనాన్ని శాసించాడు. అతనికి జతగా ప్యాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లతో మెరిశాడు. కుశాల్‌ మెండిస్‌(42), లహిరు తిరుమన్నే(30)లు మాత‍్రమే మోసర్తుగా రాణించడంతో శ్రీలంకకు ఘోర ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం స్టార్క్‌ ఐదు వికెట్లతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను స్టార్క్‌ ఖాతాలో వేసుకున్నాడు.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 534/5 డిక్లేర్డ్‌, రెండో ఇన్నింగ్స్‌ 196/3 డిక్లేర్డ్‌

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 215 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 149 ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top