ఆధిక్యం దిశగా శ్రీలంక

Sri Lanka strong in reply despite quick strikes - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

కోల్ కతా: భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. మూడో రోజు ముగిసే సమయానికి లంకేయులు నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించారు. లంక ఆటగాళ్లలో తిరుమన్నే(51;94 బంతుల్లో 8 ఫోర్లు), ఏంజెలో మాథ్యూస్(52;94 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపారు.ఈ జోడి మూడో వికెట్ కు 99 పరుగులు జోడించింది. దాంతో ఓపెనర్లు కరుణ రత్నే(8), సమరవిక్రమ(23)లను తొందరగా పెవిలియన్ కు పంపామన్న ఆనందం భారత్ శిబిరంలో ఎంతో సేపు నిలవలేదు. అయితే తిరుమన్నే-మాథ్యూస్ లు ఐదు పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు వెళ్లడంతో భారత్ కాస్త ఊపిరి పీల్చుకుంది. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ను నిర్ణీత వ్యవధి కంటే ముందుగానే నిలిపివేశారు. ఆట ముగిసేసమయానికి చండిమాల్(13 బ్యాటింగ్), డిక్ వెల్లా(14 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు.

అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌటైంది. 74/5 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను నష్టపోయింది. ఓవర్ నైట్ ఆటగాడు పుజారా(52; 117 బంతుల్లో10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆపై సాహా(29), జడేజా(22), షమీ(24)లు ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు వికెట్లు సాధించగా,గామేజ్, షనక, పెరీరాలు తలో రెండు వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు.
 

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top