దక్షిణాఫ్రికా 'భారీ' విజయం

south africa beats bangladesh by 333 runs

పోష్‌స్ట్రూమ్‌: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ను రెండో ఇన్నింగ్స్ లో 90 పరుగులకే కూల్చేసి 333 పరుగుల గెలుపును అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఏ దశలోనూ తేరుకోలేకపోయింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, రబడా, మోర్నీ మోర్కెల్ లు బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. మహరాజ్ నాలుగు వికెట్లతో రాణించగా, రబడా మూడు, మోర్నెల్ రెండు వికెట్లు సాధించారు. 

49/3 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఇన్నింగ్స్ ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 41 పరుగులు చేసి మిగతా వికెట్లు కోల్పోయింది.  దాంతో 424 పరుగుల భారీ విజయలక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపో్యిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లా ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 493/ డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 247/6 డిక్లేర్

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 320 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 90 ఆలౌట్

Back to Top