రవిశాస్త్రి గురించి అవసరమా?: గంగూలీ

Sourav Gangulys Epic Response To Question On Ravi Shastri - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి- సౌరవ్‌ గంగూలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న విషయం తెలిసిందే. 2016లో టీమిండియా కోచ్‌ పదవికి తనను రిజెక్ట్‌ చేయడానికి గంగూలీనే ప్రధాన కారణమని రవిశాస్త్రి ఎన్నో సార్లు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు దిగాడు. అయితే రవిశాస్త్రి విమర్శలపై ఇప్పటివరకు గంగూలీ సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే గంగూలీ రవిశాస్త్రిపై రివేంజ్‌ తీసుకునే సమయం వచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవిశాస్త్రి భవితవ్యం ఏంటని ప్రస్తుత ప్రశ్న.

బీసీసీఐ అధ్యక్ష పదవిలో సౌరవ్‌ గంగూలీ ఉండేది ఏడాది లోపే అయినప్పటికీ తన సహజసిద్ధమైన దూకుడుతో ఏం మార్పులు చేస్తాడనేది అభిమానులకు ఆసక్తిగా మారింది. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా త్వరలో పగ్గాలు స్వీకరించబోతున్న గంగూలీకి రవిశాస్త్రి గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజా మీడియా సమావేశంలో రవిశాస్త్రి గురించి అభిప్రాయం ఏంటని అడిగిన ప్రశ్న వైరల్‌గా మారింది... ‘ ఇప్పుడు రవిశాస్త్రి గురించి అవసరమా? ఎందుకు రవిశాస్త్రి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు అతను ఏంచేశాడని ఈ ప్రశ్న’ అంటూ గంగూలీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు ప్రశ్నించాడు.

ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షపదవికి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ నియామకం లాంఛనంగా మారింది. దీంతో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు.. చేయబోయే సంస్కరణలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top