‘ఆ ఒక్క మ్యాచ్‌ ఆడకపోతే పోయేదేం లేదు’

Sourav Ganguly Reacts To Sachin Tendulkar Comment On India vs Pakistan World Cup Match - Sakshi

సచిన్‌కు రెండు పాయింట్లే.. కానీ నాకు ప్రపంచకప్‌ కావాలి

టీమిండియా మాజీకెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ

కోల్‌కతా : ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఆడకపోతే భారత్‌కే నష్టమని, అనవసరంగా రెండు పాయింట్ల ఇవ్వడం తనకైతే ఇష్టంలేదని, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. సచిన్‌కు కేవలం రెండు పాయింట్లు మాత్రమే కావాలని, కానీ తనకు భారత్‌ ప్రపంచకప్‌ గెలవడం కావాలన్నారు. 10 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీలో ప్రతీ దేశం.. ఇతర దేశాలతో ఆడుతుందని, అలాంటప్పుడు పాక్‌తో జరిగే ఒక్క మ్యాచ్‌ ఆడకపోవడం వల్ల కలిగే పెద్ద నష్టం ఏమిలేదని ఓ జాతీయ ఛానెల్‌తో  అభిప్రాయపడ్డాడు. సచిన్‌, మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌లు.. పాక్‌తో భారత్‌ ఖచ్చితంగా ఆడాల్సిందేనని, ఆడి గెలవాలని, ఆడకపోతే అది పాక్‌ లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

ఇక ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న గంగూలీ పబ్లిసిటీ స్టంట్‌ కోసమే భారత్‌.. పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలంటున్నాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ మియందాద్‌ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ సానుకూలంగా స్పందించాడు. ‘నేను మియందాద్‌ వ్యాఖ్యలపై స్పందించాలనుకోవడం లేదు. కానీ అతని బ్యాటింగ్‌ను మాత్రం ఆస్వాదించేవాడిని. పాక్‌లో అతనో అద్భుతమైన ఆటగాడు.’ అని తెలిపాడు. ఇక భారత్‌-పాక్‌ మ్యాచ్‌ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి క్రికెటర్లందరూ కట్టుబడి ఉంటారని చెప్పుకొచ్చారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top