హర్భజన్ కు సారీ చెప్పిన గంగూలీ..!

Sourav Ganguly Goofs Up About Harbhajan Singh's Family Picture, Apologises - Sakshi - Sakshi

న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ- వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బంధం గురించి తెలియంది కాదు. గంగూలీ సారథ్యంలోనే హర్భజన్ సింగ్ కీలక స్పిన్నర్ గా ఎదిగాడు. ఆ క్రమంలోనే భజ్జీపై గంగూలీ అమితమైన విశ్వాసాన్ని కల్గి ఉండేవాడు. మొత్తంగా చెప్పాలంటే భారత జట్టులో హర్భజన్ ఎదుగుదలలో గంగూలీ పాత్ర వెలకట్టలేనిదనే చెప్పాలి.

అయితే తాజాగా భజ్జీకి గంగూలీ సారీ చెప్పాడు. భజ్జీ క్షమించు వయసు మీద పడుతుంది కదా అంటూ.. దాదా తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. ఆదివారం హర్భజన్ భార్య గీతా బస్రా, కూతురు హనయా హీర్ పల్హాతో కలిసి అమృత్‌ సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫొటోను ట్వీట్ చేశాడు. 'బాబు ఎంతో అందగా ఉన్నాడు భజ్జీ'అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఆపై వెంటనే తాను చేసిన తప్పంటే దాదా గుర్తించాడు.. 'క్షమించు హర్భజన్.. పాప చాలా అందంగా ఉంది.వయసు మీద పడుతుంది కదా'అని మరో ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ స్పందిస్తూ.. ఆశీస్సులు అందినందుకు ధన్యవాదాలు దాదా. సనాకు ప్రేమతో(గంగూలీ కూతురు).. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా'అని హర్భజన్ ట్వీట్ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top