స్టీవ్ స్మిత్ శతక్కొట్టుడు..

స్టీవ్ స్మిత్ శతక్కొట్టుడు..


ముంబై: భారత 'ఎ' జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ శతకం నమోదు చేశాడు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(25), రెన్ షా(11)లు ఆదిలోనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా తడబడినట్లు కనిపించింది.


ఆ తరుణంలో స్మిత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. షాన్ మార్ష్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే స్మిత్ సెంచరీ చేయగా, మార్ష్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ 150 పరుగులకు పైగా అజేయ భాగస్వామ్యాన్ని సాధించడంతో తొలి రోజు టీ విరామానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 161 బంతుల్లో  12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 107 పరుగులు చేసిన అనంతరం స్మిత్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు.

Back to Top