స్టీవ్‌ స్మిత్‌ ఇస్మార్ట్‌ ఫీల్డ్‌ డ్యాన్స్‌!

Smith Leaving The Ball Is One Of The Funniest Things - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో భాగంగా శుక్రవారం మూడో రోజు  వర్షం కారణంగా 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌(13 బ్యాటింగ్‌), వేడ్‌(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అయితే స్టీవ్‌ స్మిత్‌ తన బ్యాటింగ్‌ శైలితో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆఫ్‌ సైడ్‌ బంతులు సంధించిన క్రమంలో ‘ఇస్మార్ట్‌  ఫీల్డ్‌ డ్యాన్స్‌’తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆఫ్‌ స్టంప్‌ బంతులు వేస్తే చాలు వాటిని వదిలేయడమే కాకుండా డ్యాన్స్‌ విన్యాసాలు కూడా జోడించాడు. ఈ తరహాలో స్మిత్‌ బ్యాటింగ్‌ చేయడంతో ట్వీటర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు అభిమానులు.

‘నువ్వు బంతుల్ని వదిలి వేయడంలో మాస్టర్‌వి’ అని ఒక అభిమాని సెటైర్‌ వేయగా, ‘ స్మిత్‌ ఆకట్టుకునే బ్యాట్స్‌మన్‌ కాకపోయినప్పటికీ, బంతుల్ని విడిచిపెట్టడంలో స్పెషల్‌ టాలెంట్‌ మాత్రం అతనికే సొంతం’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘ ఇదొక  ఇస్మార్ట్‌  ఫీల్డ్‌ డ్యాన్స్‌’ అని మరొక అభిమాని చమత్కరించాడు. ‘ ఇది స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌’ అని మరొకరు వ్యంగస్త్రాలు సంధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top