షూటర్‌ రష్మీ రాథోడ్‌కు నిరాశ

Shooter Rashi Rathore Fails in Womens Skeet Event - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ షూటర్‌ రష్మీ రాథోడ్‌కు నిరాశ ఎదురైంది.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో రష్మీ రాథోడ్‌ 109 పాయింట్లు సాధించి 45వ స్థానంతో సరిపెట్టుకుంది.

భారత్‌కే చెందిన మహేశ్వరి చౌహాన్‌ 114 పాయింట్లతో 21వ స్థానంలో... గనీమత్‌ షెఖాన్‌ 108 పాయింట్లతో 48వ స్థానంలో నిలిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top