ఒలింపియా D/O సెరెనా

ఒలింపియా D/O సెరెనా


న్యూయార్క్‌: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తన పసిపాపను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈనెల 1న జన్మించిన తన కుమార్తె పేరు అలెక్సిస్‌ ఒలింపియా ఒహానియన్‌ జూనియర్‌గా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. సుమారు రెండు వారాల తర్వాత బయటి ప్రపంచానికి చూపిస్తూ ఆసక్తికర విశేషాల్ని ట్వీట్‌ చేశారు సెరెనా బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సిస్‌ ఒహానియన్‌.పాప పేరు ఒలింపియా, బరువు 2.78 కేజీలు, గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌: 1, ఇన్‌స్ట్రాగామ్‌ పేజెస్‌: 1, అని సరదా గణాంకాలను పోస్ట్‌ చేశారు. సెరెనా రెండు వారాల గర్భంతోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడి టైటిల్‌ గెలవడంతో ఈ ట్వీట్స్‌ చేశారు అలెక్సిస్‌. బేబి వీడియోను ఈ జంట ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకుంది. 

Back to Top