రాయల్స్ x సూపర్ కింగ్స్ | RR take on CSK in battle of supremacy | Sakshi
Sakshi News home page

రాయల్స్ x సూపర్ కింగ్స్

Apr 19 2015 2:47 PM | Updated on Sep 3 2017 12:32 AM

రాయల్స్ x సూపర్ కింగ్స్

రాయల్స్ x సూపర్ కింగ్స్

ఐపీఎల్-8లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

అహ్మదాబాద్: ఐపీఎల్-8లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు ఓటమెరుగని రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్లు తలపడనున్నాయి. ఆదివారం సాయంత్రం 4 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.

రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. చెన్నై కూడా ఆడిన మూడింటిలోనూ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తి కలిగిస్తోంది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ గాయం కారణంగా దూరమవడంతో స్టీవ్ స్మిత్ తొలి నాలుగు మ్యాచ్లకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ లో  వాట్సన్ ఆడుతున్నాడు. రాయల్స్ సమష్టిగా రాణిస్తూ అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. ధోనీ సారథ్యంలోని చెన్నై అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement