ఇంగ్లండ్‌ గెలిచింది..

Roy, Root help England take early series lead - Sakshi

మెల్‌బోర్న్‌: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు బోణి కొట్టింది. ఆసీస్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ఇంగ్లండ్‌..అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ విసిరిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 48.5 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌(180) వీరోచితంగా ఆడగా, జోరూట్‌(91 నాటౌట్‌) సమయోచితంగా ఆడాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఇంగ్లండ్‌ అవలీలగా గెలుపును అందుకుంది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది.  అరోన్‌ ఫించ్‌(107),  మిచెల్‌ మార్ష్‌(50), స్టోనిస్‌(60)లు సత్తాచాటడంతో ఆసీస్‌ మూడొందల పరుగుల మార్కును చేరింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top