కూతురితో రోహిత్ ఏం చెప్పాడో తెలుసా?
ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ శనివారం తన కుమార్తె సమైరాతో ఉన్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ప్లాస్టిక్‌కు నో చెప్పడం, సముద్రంపై వారికి ఉన్న ప్రేమ గురించి ఈ వీడియోలో రోహిత్ ఆయన కూతురికి చెప్పారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన రోహిత్ నా ముచ్కిన్తో ఈ రోజు ఉదయం సముద్రం మీద మాకున్న ప్రేమ గురించి, ప్లాస్టిక్‌కు నో చెప్పడం గురించి మాట్లాడాను. చిన్నప్పుడే వారికి అన్ని నేర్పాలి అనే శీర్షికను జోడించాడు.
చదవండి: ‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’
ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే రోహిత్ అభిమానులతో పాటు రోహిత్ సహచరుడు యజువేంద్ర చహల్ కూడా హార్ట్ సింబల్‌తో దానికి కామెంట్ పెట్టాడు. అదేవిధంగా పుట్‌బాల్‌లో రియల్ మాడ్రిడ్ అభిమాని అయిన రోహిత్, స్పానిష్ ఫుట్‌బాల్ దిగ్గజాలు 34 వ లాలిగా టైటిల్‌ను గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. 2007 లో ఐర్లాండ్‌తో వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు 50 ఓవర్ల ఫార్మాట్లో 29 సెంచరీలు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
చదవండి: ఆ రెండింటిలోనూ ఆడాలని ఉంది: రోహిత్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు