చహల్‌కు రోహిత్ వెరైటీ విషెస్‌..

Rohit Sharma Special Wishes To Yuzvendra Chahal - Sakshi

నేడు టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ పుట్టినరోజు. ఈ క్రికెటర్‌ సన్నిహితులు, అభిమానులు తమకు నచ్చిన రీతిలో చహల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ శైలిని అనుకరిస్తూ టీమిండియా ప్రస్తుత ఓపెనర్‌, హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. క్రికెట్‌ అభిమానులు సైతం ఈ రోహిత్‌ ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ‘చిన్న తమ్ముడికి గొప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు. స్పిన్‌ బౌలింగ్‌తో నువ్వు ఇంకా రాణించాలి. నీ తొర్రిపన్ను(మిస్సింగ్ టూత్‌)ను కూడా కనిపెడతావని ఆశిస్తున్నాను’ అంటూ రోహిత్‌ శర్మ వెరైటీగా చహల్‌కు విషెస్‌ తెలిపాడు. తరచుగా సెహ్వాగ్‌ ఈ విధంగా పలు అంశాలపై ట్వీట్లు చేస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే శైలిలో రోహిత్ ట్వీట్‌ చేసి ‘హిట్‌’ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్‌ శర్మకు చాహల్‌ దిమ్మతిరిగే ఝలక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top