లక్ష్యం ఎంతైనా సాధించాలనుకున్నాం: రోహిత్‌

Rohit Sharma Says We were Outplayed In All Departments In 1st T20 Against New Zealand - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య కివీస్‌ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తేశారు. దీంతో భారత్‌కు ఘోరపరాజయం తప్పలేదు.  ఈ ఓటమితో మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో టీమిండియా వెనకంజలో ఉంది.  కివీస్‌ ఓపెనర్‌ సీఫ్రెట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’ లభించింది. బహుమతి ప్రధానోత్సవం అనంతరం టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పూర్తిగా     విఫలమయ్యామని, అందుకే ఘోరంగా ఓడిపోయామని పేర్కొన్నాడు.  (కివీస్‌తో టీ20: టీమిండియా చిత్తుచిత్తుగా)

‘మేము ఏ క్రమంలోనూ లక్ష్యాన్ని చేధించే దిశగా పోరాడలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాం. భారీ లక్ష్యం చేదించే క్రమంలో వికెట్లు కోల్పోవడం, కనీసం చిన్నపాటి భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోవడం మా ఓటమికి కారణం. గతంలో టీమిండియా భారీ లక్ష్యాలను సులువుగా చేదించింది. అందులోనూ ఈ రోజు ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగినా ఓడిపోవడం బాధించింది. న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడింది. అక్లాండ్‌లో జరగనున్న రెండో టీ20లో మంచి ప్రదర్శణ చేస్తామని ఆశిస్తున్నా. లక్ష్యం ఎంత అన్నది కాదు సాధించాలి, గెలవాలి అనకున్నాం. కానీ సాధించలేకపోయాం’అంటూ రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.   (వారెవ్వా కార్తీక్‌.. వాటే క్యాచ్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top