యువ స్పిన్నర్లతో రోహిత్‌ చిట్‌ చాట్‌

Rohit Sharma interviews Yuzvendra Chahal, Kuldeep Yadav about dream dates, favourite actresses

సాక్షి, హైదరాబాద్‌ : ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న కోహ్లి సేన టీ20 సిరీస్‌కు సిద్దమైంది. వన్డే సిరీస్‌ విజయాన్ని ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు.  సరదా కబుర్లు, ఆటలతో విశ్రాంతి పొందుతున్నారు. ఇక వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యువస్పిన్నర్లు యజువేంద్ర చాహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌తో సరదాగా చిటా చాట్‌ చేశారు. ఈ వీడియోను రోహిత్‌ భయపడే ప్లేయర్లతో నా చిట్‌ చాట్‌ అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో రోహిత్‌  ఇష్టమైన హీరోయిన్స్‌, ప్రదేశాలు, కార్లు ఏమిటని ప్రశ్నిస్తూ యువ స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు.  

మీకు చాలా మంది అమ్మాయిలు అభిమానులుగా ఉంటే ఏం చేస్తారని రోహిత్‌ ప్రశ్నించగా.. చాహాల్‌ అమ్మో నాకు అమ్మాయిలంటే భయమని, ఎక్కువగా వాగే నేను తెలియని అమ్మాయిలు ముందుకు వస్తే నోట మాటరాదన్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ మాత్రం ఎలాంటి సమస్య ఉండదని , ఎప్పుడూ నేను ఎక్కువగా మాట్లడను కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ భయమేనని, స్కూల్‌ డేస్‌లో కూడా అమ్మాయిలకు దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు.

మీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరని రోహిత్‌ ప్రశ్నించగా.. చాహాల్‌ కత్రీనా కైఫ్‌ అని, కుల్దీప్‌ జాక్వీలిన్‌ ఫెర్నాండేజ్‌ అని చెప్పారు. ఇక క్రికెట్‌ ఆడని సమయంలో ఏం చేస్తారని అడగగా.. బయట స్నేహితులతో తిరుగుతానని, ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఉండదని చాహాల్‌ చెప్పాడు. కుల్దీప్‌ మాత్రం నేను ఎక్కువగా ఇంట్లోనే సాకర్‌ మ్యాచ్‌లు చూస్తూంటానన్నాడు. చాహాల్‌కు పోర్స్చే, కుల్దీప్‌కు ముస్తాంగ్‌ కార్లంటే ఇష్టమన్నారు. ఇష్టమైన ప్రదేశాల్లో కుల్డీప్‌ పారీస్‌ చెప్పగా.. చాహాల్‌ బోరా బోరా (ఫ్రెంచ్ పాలినేషియాలోని ద్వీపం) అని తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top