సిక్స్‌తోనే సెంచరీ.. డబుల్‌ సెంచరీ

Rohit Sharma Falls After Hitting Maiden Test Double Ton - Sakshi

రాంచీ:  టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్టు ఫార్మాట్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ద్విశతకం సాధించాడు. నిన్నటి ఆటలో సెంచరీ సాధించిన రోహిత్‌.. ఈరోజు ఆటలో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. ఇది రోహిత్‌కు టెస్టుల్లో డబుల్‌ సెంచరీ. ఈ టెస్టు సిరీస్‌ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ తొలి టెస్టులో డబుల్‌ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. దాన్ని మూడో టెస్టు ద్వార పూర్తి చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించాడు. రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధించే క్రమంలో 28 ఫోర్లు, 5 సిక్సర్ల సాధించాడు. కాగా, సిక్స్‌తోనే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌.. సిక్సర్‌తోనే డబుల్‌ సెంచరీ సాధించడం అతని దూకుడుగా నిదర్శనం.

 224/3 ఓవర్‌నైట్‌తో స్కోరు ఆదివారం రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు మరోసారి రోహిత్‌-రహానేలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆటలో  రహానే(115)సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పెవిలియన్‌ చేరాడు. రోహిత్‌తో కలిసి 267 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆపై రోహిత్‌-రవీంద్ర జడేజాల స్కోరు ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 199 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌.. లంచ్‌ తర్వాత ద్విశతకం సాధించాడు. కాగా, స్కోరును పెంచే క్రమంలో 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212 పరుగులు సాధించిన తర్వాత రోహిత్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top