పాక్‌తో మ్యాచ్‌కు ఉత్సాహంగా ఉన్నాం: రోహిత్‌

Rohit Sharma Excited Looking Forward To Pakistan Clash - Sakshi

దుబాయ్‌: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడటానికి ఉత్సాహంగా ఉన్నామని టీమిండియా తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌శర్మ అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్‌-2018లో భాగంగా భారత్‌ దాయదీ పాక్‌తో 19న తలపడనుంది. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం భారత్‌-పాక్‌లు తలపడటం ఇదే తొలిసారి. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు, అభిమానులు ఈ మ్యాచ్‌కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు మంచి క్రికెట్‌ ఆడాం. ఈ టోర్నీ ప్రపంచకప్‌ సన్నాహకంగా ఉపయోగపడనుంది. పాక్‌తో మ్యాచ్‌ ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాం. మేం ఈ మ్యాచ్‌పైనే దృష్టిపెట్టాం. వారు ఈ మధ్యకాలంలో మంచి క్రికెట్‌ ఆడుతున్నారు. ఢిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నా.. ప్రతీజట్టు టైటిలే లక్ష్యంగా ఆడనుంది. ప్రతీ జట్టుకు వారి బలాల దగ్గట్లు వ్యూహాలున్నాయి. దీంతో ఈ టోర్నీ రసవత్తరంగా సాగనుంది. తొలిసారి ఓ టూర్‌కు పూర్తిస్థాయి సారథ్యం వహించడం ఆనందంగా ఉంది.’ అని తెలిపాడు.

తమ ప్రదర్శనతో  ప్రేక్షకులను రంజింప చేయడానికి  ప్రతిజట్టుకు ఇదో మంచి అవకాశమని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపాడు. శనివారం శ్రీలంక-బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక భారత్‌ 18న హాంకాంగ్‌తో, 19న దాయదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. 

ధోనిని కలిసిన మాలిక్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌.. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని కలిసాడు. వీరిద్దరు సరదాగా మాట్లాడుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top