మెరిసిన రోహిత్‌, కోహ్లి

Rohit, Kohli guide with Half Centuries Indias chase of 244 runs - Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక‍్సర్‌ సాయంతో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. రెండో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు ఘన విజయంలో ప్రధాన భూమిక పోషించిన రోహిత్‌.. అదే ఊపును మూడో వన్డేలో సైతం కొనసాగించాడు. కివీస్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచిన రోహిత్‌ తన కెరీర్‌లో 39వ హాఫ్‌ సెంచరీని సాధించాడు.

కివీస్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను భారత్‌ 39 పరుగుల వద్ద ధావన్‌(28) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరొకవైపు కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 59 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్‌తో అర్థ శతకం సాధించాడు. వీరిద్దరూ వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. భారత్‌ జట్టు 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 145 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top