మేమిద్దరం కలిసి ఆడితే...

Roger Federer and Rafael Nadal team up and Twitterati

సమకాలీన టెన్నిస్‌లో వారిద్దరు సూపర్‌ స్టార్లు...ఇద్దరి ఖాతాలో కలిపి 35 సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. కోర్టులో చిరకాల ప్రత్యర్థులుగా తలపడి వీరిద్దరు అందించిన అద్భుతమైన మ్యాచ్‌లు ఎన్నో. అలాంటిది ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి జంటగా డబుల్స్‌ ఆడితే! ప్రపంచమంతటికీ కన్నుల పండుగలా ఉంటుంది. ఆ దృశ్యమే శనివారం సాక్షాత్కరించింది. లేవర్‌ కప్‌లో భాగంగా ప్రేగ్‌లో జరిగిన మ్యాచ్‌లో రోజర్‌ ఫెడరర్, రఫెల్‌ నాదల్‌ కలిపి జోడీగా బరిలోకి దిగారు.

పరస్పర అభినందనలు, ప్రోత్సాహం, ఉత్సాహం, ఉద్వేగాలతో ఈ మ్యాచ్‌ జోరుగా సాగింది.  మైదానంలోని 20 వేల ప్రేక్షకులతో పాటు విశ్వవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ అంతా ఈ అరుదైన మ్యాచ్‌ను కన్నార్పకుండా చూశారు. రఫా–బుల్‌ జోడి ఈ మ్యాచ్‌లో 6–4, 1–6, 10–5తో స్యామ్‌ క్వీరీ–జాక్‌ సాక్‌ను ఓడించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top