‘తాత్కాలిక కెప్టెన్‌’ ఉంటారా! 

Rishabh Pant gives back to Tim Paine - Sakshi

పైన్‌పై పంత్‌ విసుర్లు

మెల్‌బోర్న్‌: భారత్, ఆసీస్‌ వికెట్‌ కీపర్ల మధ్య చెణుకులు నాలుగో రోజు కూడా కొనసాగాయి. మూడో రోజు తనను ఆట పట్టించిన పైన్‌ను శనివారం పంత్‌ వదల్లేదు. తనదైన వ్యాఖ్యలతో అతని పని పట్టాడు. పైన్‌ బ్యాటింగ్‌కు వచ్చి నప్పుడు...‘మన వద్ద ఇప్పుడు ప్రత్యేక అతిథి ఉన్నారు. అసలెప్పుడైనా తాత్కాలిక కెప్టెన్‌ గురించి విన్నావా మయాంక్‌! ఇతగాడిని ఔట్‌ చేసేందుకు నువ్వేం పెద్దగా శ్రమించనవసరం లేదు జడేజా... ఎందుకంటే ఇతనికి మాట్లాడటం మాత్రమే వచ్చు.

ఎప్పుడూ అతిగా మాట్లాడటాన్నే ఇష్టపడతాడు’ అని పంత్‌ చెలరేగిపోయాడు. శనివారం పైన్‌ అద్భుత క్యాచ్‌తో పంత్‌ వెనుదిరగ్గా... ఆ తర్వాత పైన్‌ క్యాచ్‌ను పంత్‌ అందుకోవడం విశేషం. ఆ తర్వాత కూడా దీనిని కొనసాగించిన పంత్‌... లయన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ‘అనవసరంగా రేపు మళ్లీ మేం ఇక్కడికి రావాలనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top