రిషబ్‌ ముందంజ

రిషబ్‌ ముందంజ


ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్లు రిషబ్‌ అగర్వాల్, విష్ణువర్ధన్‌ ముందంజ వేశారు. త్రివేండ్రం టెన్నిస్‌ క్లబ్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌లో రిషబ్‌ అగర్వాల్‌ 4–6, 6–3, 6–1తో భారత్‌కే చెందిన చంద్రిల్‌ సూద్‌పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.


 


మరో మ్యాచ్‌లో అనిరుధ్‌ చంద్రశేఖర్‌ 3–6, 6–7 (3/7)తో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 6–7 (3/7), 6–4, 10–3తో అలెగ్జాండర్‌ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్‌ (జర్మనీ) జంటపై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.  మరో మ్యాచ్‌లో ‘సూద్‌’ బ్రదర్స్‌ చంద్రిల్‌– లక్షిత్‌ (భారత్‌) జంట 6–1,6–2తో మొహమ్మద్‌ నజీమ్‌– గౌతమ్‌ కృష్ణన్‌ రమేశ్‌ జోడీపై గెలుపొందింది. 

Back to Top