బూమ్‌ బూమ్‌ ఆఫ్రిది.. ఆ పేరు ఎవరు పెట్టారంటే?

Ravi Shastri Gave Shahid Afridi The Nickname Boom Boom - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది.. ప్రపంచ క్రికెట్‌లోనే ఓ విధ్వంసకర క్రికెటర్‌. బ్యాట్‌తోనే కాకుండా బంతితో రాణించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 37 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. ఈ పాక్‌ మాజీ ఆటగాడిని ముద్దుగా బూమ్‌ బూమ్‌ ఆఫ్రిది అని పిలుస్తుంటారు. అయితే ఈ నిక్‌నేమ్‌ ఎవరు పెట్టారనే ఆసక్తికర విషయాన్ని ఆఫ్రిది తెలిపాడు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఈ బిరుదు ఇచ్చాడని ఈ మాజీ క్రికెటర్‌ స్పష్టం చేశాడు. ఓ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ను కొనియాడుతూ బూమ్‌బూమ్‌ ఆఫ్రిదిని పలికాడని, అది కాస్త నిక్‌నేమ్‌గా మారిపోయిందని ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. ఇక రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతను తన కామెంటరీతో ప్రేక్షకులను అలరించే వాడు. గమ్మత్తైన పేర్లు, హాస్య చలోక్తులతో క్రికెటర్లను పొల్చుతూ వారికి పేర్లు పెట్టేవాడు. 

2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆఫ్రిది పాక్‌ తరపున 398 వన్డేలు, 99 టీ20, 27 టెస్లులు ఆడాడు. 6 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలతో వన్డేల్లో 8,064 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు(476) బాదిన రికార్డు కూడా ఆఫ్రిదిదే కావడం విశేషం. ఇటీవల వెస్టిండీస్‌ విధ్వంసకర క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఈ రికార్డును సమం చేశాడు.( చదవండి: సిక్సర్ల రికార్డు సమం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top