రషీద్‌.. అతను నీకు ‘బ్రో’ ఏంటి?

 Rashid Khan Calls Veteran Commentator Bro, Gets Trolled By Fans - Sakshi

డెహ్రాడూన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం బంగ్లాదేశ్‌తో చివరి టీ20లో అఫ్గాన్‌ పరుగు తేడాతో గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఈ సిరీస్‌ను అఫ్గాన్‌ గెలవడంలో ఆ జట్టు యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును గెలుచుకున్నాడు.

కాగా, చారిత్రక సిరీస్‌ను గెలిచిన అఫ్గాన్‌ జట్టును ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభినందించకుండా ఉండలేకపోయాడు. అసాధారణ రీతిలో చెలరేగిపోయి చిరస్మరణీయమైన సిరీస్‌ను సాధించిన అఫ్గాన్‌ను కొనియాడాడు. ఇక్కడ రషీద్‌ను ప్రశంసించాడు. రషీద్‌ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే అఫ్గాన్‌.. సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిందని హర్షాభోగ్లే ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపాడు.

దీనికి స్పందించిన రషీద్‌.. ‘థ్యాంక్యూ బ్రో’ అంటూ బదులిచ్చాడు. దాంతో రషీద్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘అతను నీకు బ్రో ఏంటి? అంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ‘ అతను నీకు బ్రదరా.. నీకు తండ్రిలాంటి వాడు’ అని ఒకరు విమర్శించగా, ‘నీకు 19 ఏళ్లు కాదనే విషయం నిరూపితమైందని మరొకరు చమత్కరించారు. ‘56 ఏళ్ల హర్షాభోగ్లే దిగ్గజ వ్యాఖ్యాత అయితే.. నువ్వు 20 ఏళ్ల లోపు యువ క్రికెటర్‌వి..మరొకసారి జాగ్రత్తగా బదులివ్వు’ అని మరో అభిమాని సెటైర్‌ వేశాడు. ‘అతన్ని బ్రో అనే కంటే హుందాగా సార్‌’ అంటే బాగుండేదని మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top