అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో..

Rashid Khan becomes youngest captain in international cricket - Sakshi

బులవాయో: వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించిన రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక జాతీయ క్రికెట్‌ జట్టుకు అత్యంత పిన్న వయసులో నాయకత్వం వహించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రషీద్‌ ఖాన్‌ 19 ఏళ్ల 165 రోజుల వయసులో అఫ్గానిస్తాన్‌కు సారథిగా వ్యవహరించాడు.

ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పిన్న వయసులో కెప్టెన్‌గా ఎన్నికైన రికార్డు నెలకొల్పాడు. అంత​కుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌ ఆటగాడు రజిన్‌ సలేహ్‌ పేరిట ఉండేది. 20 ఏళ్ల 297 రోజుల వయసులో బంగ్లాదేశ్‌కు రజిన్‌ నాయకత్వం వహించాడు. కాగా, ఆ రికార్డును రషీద్‌ ఖాన్‌ బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌  వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం.

నిన్న జరిగిన మ్యాచ్‌లో రషీద్ నేతృత్వంలోని అప్ఘాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో  రషీద్ పేలవ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో ఎల్బీగా గోల్డెన్ డక్ అయిన రషీద్.. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన 68 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top