కోహ్లి సరికొత్త​ చాలెంజ్‌.. రషీద్‌ ఓకే

Rashid Khan accepts Virat Kohlis quirky catches challenge - Sakshi

సౌతాంప్టన్‌‌: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలెంజ్‌లు ఎక్కువయ్యాయి. మొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఫిట్‌నెస్ చాలెంజ్‌కు స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మరొక చాలెంజ్‌ విసరగా, ఇప్పుడు తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ చాలెంజ్‌ను విసిరాడు.

తనకంటే తక్కువ సమయంలో ఈ  చాలెంజ్‌ను ఎవరైనా పూర్తి చేయగలరా? అని అడిగాడు. ఇంతకీ కోహ్లి విసిరిన చాలెంజ్‌ ఏంటని అనుకుంటున్నారా? క్యాచ్‌లు పట్టడం. క్యాచ్‌లు పట్టడం ఏముందని అనుకుంటున్నారా? అయితే, ఈ క్యాచ్‌లను కాస్త వైరటీగా పట్టాలి. అవి ఎలా పట్టాలో కూడా విరాట్ కోహ్లి తాను పోస్టు చేసిన వీడియోలో చేసి చూపించాడు.

"8 సెకన్లలో.. ఆరు క్యాచ్‌లు... ఒక్కటీ మిస్‌ అవ్వకుండా పట్టాను. మీరు నా కంటే తక్కువ సమయంలో పట్టగలరా?" అంటూ కోహ్లి... కేఎల్‌ రాహుల్‌, జాంటీ రోడ్స్‌, రషీద్‌ఖాన్‌, డుప్లెసిస్‌, షకీబ్‌ ఆల్‌ హాసన్‌, గిబ్స్‌కు సవాల్ విసిరాడు. ఈ సవాల్‌ను రషీద్‌ ఖాన్‌ స్వీకరించాడు.

ప్రస్తుతం కోహ్లి నాయకత్వంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. తొలి రెండు టెస్టులు ఇంగ్లండ్‌ గెలవగా, మూడో టెస్టులో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top