కోహ్లి గడ్డానికి ఇన్సూరెన్స్‌!

Rahul Shares Footage Of Virat Kohli Getting His Beard Insured - Sakshi

‘నాకు నా గడ్డం అంటే చాలా ఇష్టం.  నాకు గడ్డం బాగా నప్పుతుంది. అందుచేత గడ్డాన్ని తీయించి క్లీన్‌షేవ్‌లో కనబడాలని అనుకోను’అని ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  కాగా, కోహ్లి తన గడ్డానికి బీమా చేయించుకున్నాడన్న వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రకమైన సందేహాలు రేకెత్తించే వీడియోను భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

అందులో కోహ్లి గడ్డాన్ని ఓ వ్యక్తి కాస్త కత్తిరించి తీసుకోవడం.. ఆ తర్వాత కోహ్లి ఒక ఫైల్‌పై సంతకం పెట్టడం కనిపించింది. తాను పోస్ట్‌ చేసిన వీడియో కింద.. ‘హాహా! నువ్వు నీ గడ్డాన్ని ఎంతలా ప్రేమిస్తావో నాకు తెలుసు. నా థియరీ ప్రకారం నువ్వు నీ గడ్డానికి బీమా చేయించుకుంటున్నావనుకుంటున్నా’ అని రాహుల్‌ చమత్కరించాడు. మరి విరాట్‌ నిజంగా గడ్డానికి బీమా చేయించుకున్నాడా అనేది అతనికే తెలియాలి. గతంలో ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ తన కాళ్లకు బీమా చేయించుకున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top