కెప్టెన్ ధోని ప్రతిపాదనకు ద్రావిడ్ ఓకే!
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభ్యర్ధన మేరకు మనోధైర్యాన్నినింపడానికి భారత ఆటగాళ్లతో మాజీ టెస్ట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కొన్ని సెషన్లు గడపనున్నారు.
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభ్యర్ధన మేరకు మనోధైర్యాన్నినింపడానికి భారత ఆటగాళ్లతో మాజీ టెస్ట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కొన్ని సెషన్లు గడపనున్నారు. ఇంగ్లండ్ తో జూలై 9 తేదిన నాటింగ్హమ్ లో ప్రారంభం కానున్న తొలి టెస్త్ కు ముందు ద్రావిడ్ భారత ఆటగాళ్లతో సమావేశం కానున్నారని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అయితే అనధికారికంగా మాత్రమే పాల్గొంటారని, ఎలాంటి నియామకం కాదని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ డంకన్ ఫ్లెచర్ లు బీసీసీఐని కలిసి.. ద్రావిడ్ సేవలు యువ జట్టుకు అవసరమని తెలిపినట్టు సమాచారం. దాంతో బీసీసీఐ సానుకూలంగా స్పందించమే కాక.. ద్రావిడ్ ముందు ప్రతిపాదన పెట్టారు. బీసీసీఐ, ధోని, ఫ్లెచర్ లు ప్రతిపాదనకు ద్రావిడ్ కూడా సై అనడంతో కొన్ని సెషన్లపాటు సలహాలను, సూచనలను యువ క్రీడాకారులకు ఇవ్వనున్నారు. ఇంగ్లండ్ తో కీలక సిరీస్ కు ముందు ద్రావిడ్ అనుభవ పాఠాలు యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని కెప్టెన్ ధోని భావిస్తున్నారు.