ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

Professional Cricketers Take Note This, Rajasthan Royals - Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌-2019 సీజన్‌ ముగిసి చాలా రోజులే అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ అభిమానులను ఏదొక రూపంలో అలరిస్తూనే ఉంది.. బౌండరీ లైన్ వద్ద ఓ అద్భుత క్యాచ్‌ను పట్టిన యువకుడి వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ అద్భుత క్యాచ్‌ను ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ నోట్‌ చేసుకోండి అంటూ పేర్కొంది. కొందరు యువకులు రెండు జట్లుగా విడిపోయి కొబ్బరి తోటలో క్రికెట్‌ ఆడుతున్నారు. అక్కడ బౌండరీ లైన్ కూడా పెట్టుకున్నారు.

ప్రత్యర్థి బౌలర్ వేసిన బంతిని ఓ బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌ ఆడగా.. బంతి బౌండరీ బయటికి వెళుతున్న సమయంలో బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న ఒక యువకుడు బంతిని చూస్తూ గాల్లోకి ఎగిరి క్యాచ్‌ పట్టి.. తాను బౌండరీలో పడేలోగా బంతిని మళ్లీ గాల్లో నుంచే మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకోవడంతో బ్యాట్స్‌మన్‌ ఔట్ అయ్యాడు. యువకుడు బౌండరీ దగ్గర అసాధారణ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ వీడియోను అక్కడే ఉన్న మరో యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆర్ఆర్ యాజమాన్యం తమ ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసింది. ఈ క్యాచ్‌ను ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ నోట్‌ చేసుకోండి అంటూ పేర్కొంది.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top