మా విజయ రహస్యం ఇదే..

Playing as a unit is key to our success: Rohit Sharma - Sakshi

సాక్షి, ముంబై : ఆటగాళ్లందరూ కలిసికట్టుగా రాణించడమే టీమిండియా వరుస విజయాల వెనుక ఉన్న అసలు రహస్యమని వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. సోమవారం ముంబైలో ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం ప్రతి ఒక్కరిది. మేము ఆడుతున్నది నగరానికో, దేశానికో కాకుండా గెలుపే ముఖ్యంగా భావిస్తాం. కానీ ఇది అంత సులభం కాదు. మేము వరుసగా ఆరు సిరీస్‌లు గెలిచాం. కలిసికట్టుగా రాణించడంతోనే ఈ విజయాలు సులువయ్యాయి. ఒకరిద్దరి వల్ల టోర్నీలు గెలవలేము. ఇక ప్రపంచకప్‌కు చాల సమయం ఉంది. ఇప్పుడే దాని గురించి మాట్లడటం సమంజసం కాదు. మేము మాత్రం ప్రపంచకప్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కెప్టెన్‌, కోచ్‌, సెలక్టర్లు ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్దం చేస్తున్నారు. టీం మేనేజ్‌మెంట్‌ ఆటగాళ్ల నుంచి ఏం ఆశిస్తుందో ఆటగాళ్లందరికి తెలుసు.అని రోహిత్‌ వ్యాఖ్యానించారు.

ఇక న్యూజిలాండ్‌ సిరీస్‌ ప్రణాళికలను ప్రస్తావించగా.. ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేవు. జట్టు సభ్యులంతా హోటల్‌కు చేరిన మరుక్షణం మా ప్రణాళికలను ప్రారంభిస్తాం. రెండు రోజుల క్రితమే ఓ సిరీస్‌ను గెలుపుతో ముగించాం. మా ప్రత్యర్థిని ఓడించడమే మా లక్ష్యమని ఈ ముంబై ఆటగాడు చెప్పుకొచ్చారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top