ఈ షాట్‌కు ఏం పేరు పెడతారు?: బీసీసీఐ

Pant Attempts A Switch Hit At The Nets Ahead Of T20I Series - Sakshi

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌.. కివీస్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ప్రాబబుల్స్‌లో ఎంఎస్‌ ధోనితో పాటు దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. దాంతో భారత్‌ ముగ్గురు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లతో కివీస్‌తో పోరుకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే నెట్స్‌లో రిషభ్‌ శ్రమిస్తున్నాడు. అయితే నెట్‌ ప్రాక్టీస్‌లో రిషభ్‌ ఆడిన ఓ షాట్‌ను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ వేసిన లెంగ్త్‌ బాల్‌ను బ్యాట్‌ తిప్పి మరీ వికెట్ల వెనుకకు ఆడాడు రిషభ్. ‘ఈ షాట్‌కు మీరు ఏ పేరు పెడతారు’ అంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది.  రేపట్నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరుగనుంది. వెల్లింగ్టన్‌ వేదికగా బుధవారం  మధ్యాహ్నం గం. 12.30ని.లకు ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top