హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీకి శ్రీకాంత్ దూరం
గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ నుంచి తప్పుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్... తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌కూ దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకాంత్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని ఫిజియో సి. కిరణ్ తెలిపారు. హాంకాంగ్ ఓపెన్ మంగళవారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్... వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో బరిలోకి దిగుతాడు.
మరిన్ని వార్తలు