మ్యాచ్‌ మధ్యలో ఐస్‌బాత్‌!

Novak Djokovic Enjoys Ice Bath At US Open - Sakshi

సిన్సినాటి (అమెరికా): సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మ్యాచ్‌ మధ్యలో ఐస్‌బాత్‌ను ఆస్వాదించాడు. యూఎస్‌ ఓపెన్‌లో భాగంగా మంగళవారం మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరి)తో జరిగిన తొలి రౌండ్‌ ఆట మధ్యలో అతనితో కలిసి జకోవిచ్‌ ఐస్‌బాత్‌ చేశాడు. గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్‌ మధ్యలో 10 నిమిషాల బ్రేక్‌ను తీసుకున్నారు. వేడిమి ఎక్కువ ఉండటంతో నిర్వాహకులు ఇలా అనుమతినిచ్చారు. అయితే ఈ బ్రేక్‌ సమయంలో జకోవిచ్‌, ఫక్సోవిక్స్‌లు నగ్నంగా కూర్చోని ఐస్‌బాత్‌తో వేడిమి నుంచి ఉపశమనం పొందారు.

10 నిమిషాల బ్రేక్‌ ఇచ్చిన యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులకు జకోవిచ్‌ ధన్యవాదాలు తెలిపాడు. విశ్రాంతి ఇద్దరి ఆటగాళ్లకు అవసరేమనని, ఐస్‌బాత్‌తో అద్భుత భావన పొందినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఐస్‌బాత్‌తోనే కోర్టులో రాణించగలిగామని తెలిపాడు. తొలి రౌండ్‌లో జకోవిచ్‌ 6-3, 3-6, 6-4, 6-0తో మార్టన్‌ ఫక్సోవిక్స్‌పై విజయం సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top