'నా బౌలింగ్‌ ఎవ్వరికీ అంతుచిక్కదు’

no analyst can catch My bowling, Kuldeep Yadav - Sakshi

న్యూఢిల్లీ:భారత క్రికెట్‌ జట్టులోకి చైనామన్‌ బౌలర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌)గా దూసుకొచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ తన బౌలింగ్‌ను ప‍్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆడటం అంత ఈజీ కాదని అంటున్నాడు. తన బౌలింగ్‌ను అంచనా వేయడం సులభం కాదని పేర్కొన్న కుల్దీప్‌.. వీడియోల విశ్లేషణ ద్వారా కూడా తన బౌలింగ్‌ అంతు చిక్కదని పేర్కొన్నాడు.

'చాలాకాలం నుంచి టెక్నాలజీ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. అయినా నా బౌలింగ్‌ను టెక్నాలజీ ద్వారా పట్టుకోవడం సులభం కాదు. ఒకసారి బంతిని టర్న్‌ చేసిన తర్వాత అది అవతలి బ్యాట్స్‌మన్‌ను ఆలోచనలో పడేస్తుంది. ఎలా ఆడాలో అప్పటి పరిస్థితిని మాత్రమే బ్యాట్స్‌మన్‌ డిసెడ్‌ చేసుకోవాలి. ఇక‍్కడ వీడియోల ద్వారా నా బౌలింగ్‌ను అంచనా వేయడం కష్టం. అదే నన‍్ను సక్సెస్‌ ఫుల్‌ స్పిన్నర్‌గా నిలిపింది. నా బౌలింగ్‌ను అంచనా వేసే క్రమంలో చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టినా.. ఏ ఒక్క విశ్లేషకుడు నా మాయాజాలపు శైలిని పట్టుకోలేరు. అది కేవలం మ్యాచ్‌ జరుగుతున్నపుడు బ్యాట్స్‌మన్‌ ఆలోచన, ఎదురుదాడిపైన మాత‍్రమే ఆధారపడి వుంటుంది. ఇక మ్యాచ్‌ పరిస్థితిని బట్టి బౌలింగ్‌ను వేయడం నాకు తెలిసిన విద్య. రెగ్యులర్‌ ప్రాక్టీస్‌తో నా బౌలింగ్‌కు సానబెడుతూనే ఉన్నా. అదే నన్ను వైవిధ్యమైన బౌలర్‌గా నిలిపింది' అని కుల్దీప్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top