న్యూజిలాండ్‌దే బ్యాటింగ్‌

New Zealand Women Won The Toss And Choose To Bat - Sakshi

హామిల్టన్‌ : భారత మహిళలతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే వరుస రెండు టీ20లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న కివీస్‌.. అదే ఊపులో చివరి మ్యాచ్‌ను గెలిచి భారత్‌ను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. ఇక బ్యాటింగ్‌ వైఫల్యంతో తొలి రెండు టీ20ల్లో పరాజయం పాలైన భారత మహిళలు తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వైట్‌వాష్‌ తప్పించుకోవాలని చూస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన వెటరన్‌ మిథాలీరాజ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కింది. మిథాలీ రాకతో భారత బ్యాటింగ్‌ మెరగవచ్చు. టాపార్డర్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లపై జట్టు అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు. ఆమె చెలరేగితే కానీ భారత్‌ గట్టెక్కెలా లేదు. (చదవండి : అమ్మాయిలూ...  ఇదొక్కటైనా?)

తుదిజట్లు:
భారత్‌: ప్రియాపూనియా, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ, తానియా భాటియా, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్‌, మాన్షి జోషి, పూనమ్‌ యాదవ్‌

న్యూజిలాండ్‌ : సోషి డెవిన్‌, సుజీ బెట్స్‌, అమీ సట్టెర్‌వైట్‌ (కెప్టెన్‌), కెటీ మార్టిన్‌, అన్నా పీటర్సన్‌, కాస్పెర్క్‌, అమెలియా కెర్‌, రోస్‌మెరీ మైర్‌, హైలే జెన్సన్‌, లీ తాహుహు, హన్నా రోవ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top