కాల్పుల ఎఫెక్ట్‌.. టెస్ట్‌ మ్యాచ్‌ రద్దు

New Zealand Vs Bangladesh Third Test Called Off Over Christchurch Shooting - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌, క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలో మజీదులే లక్ష్యంగా శుక్రవారం అగంతకుడు కాల్పులకు తెగబడటంతో అక్కడి రోడ్లు రక్తసిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటన నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు.  ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్ట్‌ రద్దైంది. గత నెలరోజులుగా న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మసీదుకు ప్రార్థనలకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు మసీదులోకి చొరబడి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఆటగాళ్లు పక్కనే ఉన్న పార్కోలోంచి తప్పించుకున్నారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుజట్లు మ్యాచ్‌ను రద్దుచేసుకోవడమే ఉత్తమమనే అంగీకారానికి వచ్చాయని, ఇరుజట్ల ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు తన ట్విటర్‌ పేజీ బ్లాక్‌ క్యాప్స్‌లో ప్రకటించింది. దీంతో రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన హగ్లే ఓవల్‌ టెస్ట్‌ రద్దైంది. ఇప్పటికే రెండు టెస్ట్‌లను గెలిచి ఆతిథ్య జట్టు కివీస్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ కాల్పుల ఘటనలో మృతుల వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. 8 మంది మరణించినట్లు 50 మంది వరకు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.  

చదవండి: న్యూజిలాండ్‌లో కాల్పులు.. బంగ్లా క్రికెటర్లు సురక్షితం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top