‘అతను గూగ్లీనీ బాగా ఉపయోగిస్తాడు’

New Zealand Coach Gary Stead Says Kuldeep Yadav Uses Googly Very Well - Sakshi

మౌంట్‌ మాంగనీ :  భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై న్యూజిలాండ్‌ జట్టు కోచ్‌ గ్యారీ స్టెడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్‌ ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ నడ్డి విరిచి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ రెండో వన్డేలో అదే తరహా ప్రదర్శనను పునరావృత్తం చేసి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ నేపథ్యంలో కివీస్‌ కోచ్‌ గ్యారీ మాట్లాడుతూ.. కుల్దీప్‌ ఓ తెలివైన బౌలరని కొనియాడాడు.

‘కుల్దీప్‌ చాలా తెలివైన బౌలర్‌. ఎడమ చేతి మణికట్టు స్నిన్నర్లు చాలా అరుదు. అతను గూగ్లీలను అద్భుతంగా సంధిస్తాడు. అతన్ని ఎదుర్కునే మార్గాన్ని కనిపెడ్తాం. తొలి వన్డేలో 7 ఓవర్ల వరకు ఒక్క వికెట్‌ తీయకపోవడంతో కుల్దీప్‌ బౌలింగ్‌ను మా బ్యాట్స్‌మెన్‌ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని భావించాను. కానీ అతని తన కోటా పూర్తయ్యే లోపే మమ్మల్ని దెబ్బతీశాడు. అతనికి చిక్కకుండా మేం ఆడితే మా జట్టుకు విజయం దక్కే అవకాశం ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. ఇక తొలి వన్డేలో (4/39) అదరగొట్టిన కుల్దీప్‌.. రెండో వన్డేలోను (4/45)తో రాణించి భారత్‌ 90 పరుగుల విజయన్నందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో భారత్‌ ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించగా మూడో వన్డే సోమవారం జరగనుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top