చెలరేగిన ఉతప్ప, నరైన్

చెలరేగిన ఉతప్ప, నరైన్


రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఆది నుంచి విరుచుకుపడింది. కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్(42; 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్) తో మెరుపులు మెరిపించగా, కెప్టెన్ గౌతం గంభీర్(33;28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్)తో ఆకట్టుకున్నాడు. దాంతో ఐదు ఓవర్లలోనే కోల్ కతా వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ఆ తరువాత రాబిన్ ఉతప్ప(72;48 బంతుల్లో8 ఫోర్లు,2 సిక్సర్లు) తనదైన శైలిలో అలరించాడు. ఇక మనీష్ పాండే(24;21 బంతుల్లో 2 ఫోర్లతో) కాస్త పర్వాలేదనిపించాడు. అయితే చివరి ఓవర్లలో కోల్ కతా జట్టు నుంచి భారీ పరుగులు రాకపోవడంతో ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో ఫల్కనర్, సురేశ్ రైనా, ప్రవీణ్ కుమార్,బాసిల్ తంపిలకు లకు తలో వికెట్ దక్కింది.నరైన్ జోరు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్  గా వచ్చిన సునీల్ నరైన్ మరోసారి విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి కోల్ కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోల్ కోత్ చేసిన తొలి 45 పరుగుల్లో 42 పరుగులు నరైన్వే కావడం ఇక్కడ విశేషం. కోల్ కతా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగింది. దాంతో గౌతం గంభీర్ కలిసి నరైన్ ఓపెనర్ గా వచ్చాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో నరైన్ ను ఓపెనర్ గా ప్రయోగిస్తోంది కోల్ కతా. ఈ ఐపీఎల్ సీజన్ లో అంతకుముందు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నరైన్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. మరొకసారి గుజరాత్ పై నరైన్ విరుచుకుపడటంతో కోల్ కతా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.ఆపై రాబిన్ ఉతప్ప కూడా దూకుడుగా ఆడాడు.గుజరాత్ లయన్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీ వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో ఆరు ఫోర్లు 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేశాడు.

Back to Top