విజయ్‌ శతక్కొట్టుడు

Murali Vijay gets Century in Afghanistan Test Match - Sakshi

బెంగళూరు: క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు ఆడుతున్నఅఫ్గానిస్తాన్‌ను టీమిండియా ఆడేసుకుంటుంది. తొలుత శిఖర్‌ ధావన్‌ సెంచరీతో రెచ్చిపోతే, మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ కూడా శతకం సాధించాడు. 143 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో విజయ్‌ సెంచరీ నమోదు చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచిన విజయ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.  విజయ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లు ఆరంభించారు. శిఖర్‌ ధావన్‌(107;96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించి భారత్‌ను పటిష్ట స్థితికి తీసుకెళ్లాడు. అతనికి జతగా మురళీ విజయ్‌ కూడా సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ 168 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్న విజయ్‌ ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు.  ఈ క్రమంలోనే సెంచరీ మార్కును చేరాడు. కాగా, రాహుల్‌తో కలిసి 112 పరుగులను జతచేసిన విజయ్‌(105; 153 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో రాహుల్‌(54) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో 284 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను నష్టపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top