ముంబై–చెన్నై పోరుతో ఐపీఎల్‌ షురూ 

Mumbai Indians to take on Chennai Super Kings in IPL 2018  - Sakshi

ఏప్రిల్‌ 7 నుంచి మే 27 వరకు లీగ్‌

9న రాజస్తాన్‌తో సన్‌రైజర్స్‌ తొలి మ్యాచ్‌

ముంబై: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ల మధ్య జరిగే తొలి పోరుతో ఈ సీజన్‌ ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఏప్రిల్‌ 7న వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్‌కే సీజన్‌ తొలి మ్యాచ్‌తోనే పోరాటానికి సిద్ధమవుతోంది. సీఎస్‌కేలాగే మళ్లీ వచ్చిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ తొలి పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఏప్రిల్‌ 9న ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

అనంతరం హైదరాబాద్‌లో 12న ముంబై ఇండియన్స్‌తో, 22న చెన్నైతో, 26న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో, మే 5న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 7న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో, 19న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. పంజాబ్‌ మాత్రం తమ హోమ్‌ మ్యాచ్‌ల్లో మూడింటిని ఇండోర్‌లో, మిగతా నాలుగు మ్యాచ్‌ల్ని మొహాలీలో ఆడనుంది. 22న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌తో పాటు 27న టైటిల్‌ పోరు కూడా వాంఖెడేలోనే జరుగుతాయి. అయితే మ్యాచ్‌ల టైమింగ్‌లో ఏ మార్పూ లేదు. గతంలో మాదిరిగానే ఒక మ్యాచ్‌ ఉంటే రాత్రి 8 గంటలకు, రెండు మ్యాచ్‌లుంటే మొదటి మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి.  

Back to Top