ఆ అనుభవం మార్కెట్‌లో దొరికేది కాదు'

MS Dhonis Experience Cant Be Bought, Ravi Shastri - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మరొకసారి మద్దతుగా నిలిచాడు. ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా, ఒక వికెట్‌ కీపర్‌గా ఎంతో అనుభవం ఉన్న ధోనిలో ఇంకా ఎంతో అసాధారణ ప్రతిభ దాగి వుందని రవిశాస్త్రి కితాబిచ్చాడు. ఈ క‍్రమంలోనే ధోని అనుభవం మార్కెట్‌లో దొరికే వస్తువు కాదంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'క్రికెట్‌ వరల్డ్‌కు దొరికిన ఒక గ్రేటెస్ట్‌ వన్డే ఆటగాడు ధోని. అంతేకాదు.. అరుదైన ఆటగాడు కూడా. ప్రస్తుతం ధోనిని ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే ఎంతో ముందంజలో ఉన్నాడు.

ఫైనల్‌ ఓవర్లలో మ్యాచ్‌ను ముగించి మంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా ధోని గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనిలా మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే ఆటగాళ్లు క్రికెట్‌ చరిత్రలో చాలా తక్కువనే చెప్పాలి. సాధారణంగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్‌ దిగే ధోని ఆ స్థానాల్లో తన మార్కును ఆటను చూపెడుతునే ఉన్నాడు. అతని అనుభవానికి సబ్‌స్టిట్యూట్‌ లేడు. అతని అనుభవం భారత జట్టుకు చాలా విలువైనది. అది మార్కెట్‌లో దొరికే వస్తువు ఎంత మాత్రం కాదు' అని రవిశాస్త్రి తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top