ఎంఎస్ ధోని మరో రికార్డు

MS Dhoni makes another record by completing 200 catches

పుణె: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మరో రికార్డును సాధించాడు. వన్డే ఫార్మాట్ లో సొంతగడ్డపై రెండొందల క్యాచ్ లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భాగంగా భువనేశ్వర్ బౌలింగ్ లో గప్టిల్ క్యాచ్ ను పట్టిన ధోని  ఈ ఫీట్ ను సాధించాడు. మరొకవైపు ఓవరాల్ గా సొంతగడ్డపై రెండొందల వన్డే క్యాచ్ లను పట్టిన మూడో  వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు. ధోని కంటే ముందు కుమార సంగక్కరా(శ్రీలంక), అలెక్ స్టివార్ట్(ఇంగ్లండ్)లు తమ గడ్డపై రెండొందల క్యాచ్ లను పట్టిన వికెట్ కీపర్లు. ఆ తరువాత స్థానంలో ధోని ఉన్నాడు.

ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్ లు పట్టిన జాబితాలో ధోనీ నాల్గో స్థానంలో ఉన్నాడు.  ప్రస్తుతం ధోని 288 వన్డే క్యాచ్ ల పట్టి నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌(ఆసీస్-417), మార్క్‌ బౌచర్‌ (దక్షిణాఫ్రికా-402), సంగక్కర(శ్రీలంక-383) మాత్రమే ధోనీ కంటే ముందు ఉన్నారు. నిన్నటి మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోని రెండు క్యాచ్ లు పట్టాడు. ముందు గప్టిల్ క్యాచ్ పట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ధోని.. ఆపై రాస్ టేలర్ క్యాచ్ ను కూడా అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top