ధోని నిరూపించుకోవాలా?

ధోని నిరూపించుకోవాలా?


న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున ఆడుతున్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మద్దతుగా నిలిచాడు. ఈ సీజన్ లో ధోనికి ఇంకా ఆకట్టుకోలేని తరుణంలో అతనిపై వస్తున్న విమర్శలను వార్న్ కొట్టిపారేశాడు. మైదానంలో ధోని తానెంటోనిరూపించుకోవడానికి అతని వద్ద ఇంకేమీ లేదన్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన ధోని ఎవరికోసం ఇంకా నిరూపించుకోవాలంటూ వార్న్ గట్టిగా ప్రశ్నించాడు.


 


' మేటి ఆటగాడు ధోని. ఆ విషయం ఎప్పుడో రుజువు చేసుకున్నాడు ధోని. ఇప్పుడు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ లు ఆడనంత మాత్రానా ధోని తన సత్తా నిరూపించుకోవాలంటూ విమర్శించడం తగదు. అతను ఎవరికోసం ఎందుకోసం నిరూపించుకోవాలి. నాకు తెలిసి ధోనికి ఆ అవసరమే లేదు' అని వార్న్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.ప్రధానంగా పుణె సూపర్ జెయింట్ యాజమాన్యం ధోనిపై చేసిన విమర్శల నేపథ్యంలోనే వార్న్ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top