నాలుగు ఓవర్లు వేస్తే అలసిపోరు: ధోని

MS Dhoni differs with Virat Kohli on opinion to rest key bowlers in IPL 2019 - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌ వేదికగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రధాన బౌలర్లను ఐపీఎల్‌లో ఆడించకుండా విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవలే బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసిందే.

అయితే, కోహ్లీ వ్యాఖ్యలపై ఎంఎస్‌ ధోని తనదైన శైలిలో స్పందించాడు. ‘వరల్డ్‌కప్‌కు ముందు భారత బౌలర్లకు గాయపడకుండా చూసుకోవడం మంచిదే. కానీ, ఐపీఎల్‌లో మ్యాచ్‌కు నాలుగు ఓవర్లు వేస్తే బౌలర్లు ఏమీ అలసిపోరు. అలా అని పూర్తిగా విశ్రాంతి ఇస్తే మ్యాచ్‌ కామెంటేటర్లు లయ కోల్పోయారంటూ వ్యాఖ్యానిస్తారు. ఒకవేళ ఎక్కువ మ్యాచ్‌లు ఆడించామంటే? బాగా అలసిపోయారని పెదవి విరుస్తారు. దీనిని బట్టి బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. వరల్డ్ కప్‌కి ముందు బౌలర్లని ఐపీఎల్‌లో ఆడించాలనేది మంచి ఆలోచనే. వారు లయ అందుకునేందుకు అక్కడ చక్కటి అవకాశం దొరుకుతుంది. ఒత్తిడిలో బౌలింగ్‌ ఎలా చేయాలి. యార్క్‌ర్లు ఎలా వేయాలి. వైవిధ్యమైన బంతులను ఎలా సంధించాలి అనే విషయాలపై అవగాహన వస్తుంది. దాంతో  ఐపీఎల్‌లో భారత  బౌలర్లను ఆడించడమే సరైనది అనేది నా ఆభిప్రాయం’ అని ధోని చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top