ధోని డ్యాన్స్ వీడియో వైరల్

MS Dhoni dancing on Desi Boyz song, Sakshi can't stop laughing - Sakshi

రాంచీ:టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ అనంతరం విరామం దొరకడంతో ధోని కుటుంబంతో గడుపుతున్నాడు. దీనిలో భాగంగా  2012 విడుదలైన బాలీవుడ్‌ చిత్రం  'దేశీ బాయ్స్‌'లోని 'ఝగ్‌ మార్‌ కే' పాటకు ధోని స్టెప్పులేశాడు.

ఈ వీడియోను చిత్రీకరించిన భార్య సాక్షి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇక్కడ ధోని డ్యాన్స్ చేస్తున్నంతసేపు సాక్షి పగలబడి నవ్వుతూ వీడియోలో కనిపించింది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top