ధోనికే పట్టం కట్టారు

MS Dhoni Become Most Popular Indian Sports Personality - Sakshi

మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్పోర్ట్స్‌మెన్‌గా ధోని

ముంబై : మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్పోర్ట్స్‌మెన్‌ ఎవరని అడిగితే అందరి నోటి వచ్చే మాట మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ లేక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అని. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఎందుకంటే.. ఇలా అడిగితే ఎక్కువ మంది టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరు తెలిపారు.

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన వ్యక్తులపై యుగవ్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. 40 లక్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ధోనినే నిలవడం విశేషం. ధోనికి 7.7 శాతం మద్దతు తెలుపగా.. సచిన్‌కు 6.8 శాతం, కోహ్లికి 4.5 శాతం ఓట్లు వచ్చాయి. ఇటీవలే వన్డేల్లో 10వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా ధోని రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ పర్యటనలో ధోని బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్‌ తీసుకోవాలని కూడా పులువురు డిమాండ్‌ చేశారు. అయితే విమర్శకులకు ఈ సర్వే చెంపపెట్టులాంటిదని ధోని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top